Breaking News

‘రాధేశ్యామ్’ యూనిట్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్

0 0

సంక్రాంతి పండగ సందర్భంగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు హీరో ప్రభాస్ ఖరీదైన టైటాన్ రిస్ట్ వాచెస్‌ను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అందించాడు. ఈ మేరకు బహుమతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ మంచితనంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ‘రాధే శ్యామ్’ వేసవికి విడుదల కానుండగా… ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ దసరాకు విడుదలయ్యే అవకాశం ఉంది.