దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే వాటిని కొనుగోలు చేసి ఉద్యోగులకు అందించాలని యోచిస్తున్నట్లు ఐటీసీ కంపెనీ హెచ్ఆర్ విభాగం తెలియజేసింది. ఇప్పటికే వ్యాక్సిన్లు తయారుచేసే కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. టీకాలు కమర్షియల్గా వాడుకలోకి వచ్చాక తాము ఉద్యోగులకు అందిస్తామని టాటా స్టీల్ యాజమాన్యం తెలిపింది. అటు పెద్దమొత్తంలో వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ, మహింద్రా గ్రూప్ కంపెనీలు తెలియజేశాయి.