బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 33 పరుగుల ఆధిక్యం లభించింది. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో శార్దూల్ ఠాకూర్ (67), వాషింగ్టన్ సుందర్ (62) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోహిత్ (44), మయాంక్ (38), రహానె (37) స్కోర్లు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు ఐదు వికెట్లు దక్కగా స్టార్క్ 2, కమిన్స్ 2, లైయన్ ఓ వికెట్ సాధించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అటు గబ్బా స్టేడియంలో శార్దూల్ ఠాకూర్, వాష్టింగన్ సుందర్ భారత్ తరఫున ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (123) అందించిన జోడీగా నిలిచింది. అటు టెస్ట్ క్రికెట్లో సిక్సర్ ద్వారా పరుగుల ఖాతా తెరిచిన రెండో ఇండియన్‌గా శార్దూల్ ఘనత సాధించాడు. తొలి ఇండియన్ రిషబ్ పంత్. అంతేకాకుండా సిక్సర్‌తోనే శార్దూల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అటు ఆడిన తొలి టెస్టులో మూడు వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన రెండో ఇండియన్‌గా సుందర్ నిలిచాడు.