Breaking News

డైపర్ బుడ్డోడి బ్యాటింగ్ స్టైల్‌కు కేటీఆర్ ఫిదా

0 0

సరిగ్గా ఏడాదిన్నర కిందట కోల్‌కతాకు చెందిన షేక్ షాహిద్ డైపర్ వేసుకునే వయసులోనే బ్యాట్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ క్రికెటర్ మైకెల్ వాన్ ఈ బుడ్డోడిని చూసి ఆశ్చర్యంతో పాటు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలామంది ఈ చిన్నారి సచిన్ 2.O అని కూడా ప్రశంసించారు. ఈ నాలుగేళ్ల బుడ్డోడు ప్రస్తుతం తన బ్యాటింగ్ స్టైల్‌పై మంత్రి కేటీఆర్‌కు అతడు ఓ వీడియో షేర్ చేశాడు. దీన్ని చూసిన కేటీఆర్ షాహిద్‌పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా దీనిపై మీరేమంటారని క్రికెట్ దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, హర్ష బోగ్లేలను ట్యాగ్ చేశారు.