చెన్నైకు చెందిన గణేష్ అనే 22 ఏళ్ల యువకుడు లవ్లీ గణేష్ పేరుతో ఫేస్బుక్ ఖాతాను తెరిచాడు. దీని ద్వారా తన మాయమాటలతో అతడు చాటింగ్ చేస్తూ అమ్మాయిలను లవ్‌లో పడేసి ఏకంగా 12 మందిని పెళ్లాడాడు. అయితే చివరి భార్య ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు మేజర్లు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొన్నిరోజులకే తన భర్త మీద అనుమానం వచ్చిన భార్య ఆరా తీయగా అంతకుముందే 11 పెళ్లిళ్లు అయినట్లు తెలుసుకుని షాక్‌కు గురైంది. అతడి నిజస్వరూపాన్ని కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు గణేష్‌ను అరెస్ట్ చేసి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఫేస్బుక్ ప్రేమలో పడవద్దని పోలీసులు యువతులను హెచ్చరిస్తున్నారు.
