Breaking News

సత్యసాయి చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి

1 0

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని కుమ్మరపేటలో ఓ వింత చోటుచేసుకుంది. ఆంజనేయులు అనే డ్రైవర్‌కు చెందిన ఆటో వెనుక సత్యసాయి చిత్రపటం అతికించి ఉంది. అయితే సదరు ఫోటో నుంచి విభూతి రాలుతుందని గమనించిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డ్రైవర్‌కు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు ఆటో వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టి విభూతిని తీసుకుంటున్నారు. ఇదంతా బాబా మహిమగా వారు చెప్పుకుంటున్నారు. కాగా సత్యసాయి జన్మించి పరమపదించిన పుట్టపర్తిలోనే ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావడం గమనార్హం.

-->