Breaking News

‘పెళ్లిసందడి’ మూవీకి 25 ఏళ్లు

0 0

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన ‘పెళ్లి సందడి’ మూవీ రిలీజై నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 1996లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని రూ.85 లక్షల బడ్జెట్‌తో నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ లాంగ్ రన్‌లో రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్, హీరో శ్రీకాంత్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమాలో చరిత్రలో నిలిచిపోయేలా సహకరించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాతలు, ప్రేక్షకులకు దర్శకుడు రాఘవేంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో ఈ సినిమా మూడు నంది అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో హిందీ, తమిళంలోనూ ఈ మూవీని రీమేక్ చేశారు.

-->