Breaking News

చివరిరోజు టీమిండియాదే.. సిడ్నీ టెస్టు డ్రా

1 0

సిడ్నీ టెస్టులో ఆఖరి రోజు టీమిండియా గొప్పగా పోరాడింది. 98/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన కాసేపటికే భారత్ రహానె వికెట్‌ను కోల్పోయింది. దీంతో మ్యాచ్ చేజారుతుందని అంతా భావించారు. కానీ పుజారా (77), పంత్ (97) నాలుగో వికెట్‌కు అద్భుత భాగస్వామ్యాన్పి నెలకొల్పారు. పంత్ కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నా ఆసీస్‌కు ఓటమి భయాన్ని అయితే కలిగించాడు. అనంతరం విహారికి తొడకండరాలు పట్టేసినా గొప్పగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో ఉండటమే లక్ష్యంగా డిఫెన్స్ ఆడాడు. అతడికి అశ్విన్ మంచి సహకారం అందించాడు. దీంతో వీరిద్దరూ మరో వికెట్ పడకుండా మూడున్నర గంటలకు పైగా బ్యాటింగ్ చేశారు. విహారి 23 (161 బంతుల్లో), అశ్విన్ 39 (128 బంతుల్లో) ఆసీస్ బౌలర్లను అలిసిపోయేలా చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. బ్రిస్బేన్‌లో జరిగే ఆఖరి టెస్టులో ఫలితం విజేతను నిర్ణయించనుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసిన స్టీవ్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

-->