Breaking News

టీమిండియా అప్పుడలా.. ఇప్పుడిలా..

0 0

ఆస్ట్రేలియాతో వారి గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఎత్తుపల్లాలను చవిచూసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించిన అడిలైడ్ టెస్టులోని రెండో ఇన్నింగ్సులో పట్టుమని 30 ఓవర్లు కూడా ఆడని భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును మూటగట్టుకుంది. కానీ రెండు వారాలు తిరిగేసరికి రహానె కెప్టెన్సీలో సిడ్నీ టెస్టులోని రెండో ఇన్నింగ్సులో అదే ఆసీస్ బౌలర్లపై 131 ఓవర్లు సహనంగా ఆడి 334/5 చేసి అందరి మనసులు గెలుచుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను అధిగమించింది. 1990 నుంచి నాలుగో ఇన్నింగ్సులో భారత్ 100కు పైగా ఓవర్లు బ్యాటింగ్ చేయడం ఇది నాలుగో సారి మాత్రమే. గతంలో 1992, 1997, 2002లో మాత్రమే భారత్ ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసింది. 2002లో ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ టెస్టులో భారత్ ఈ ఫీట్ చేయగా అగార్కర్, నెహ్రా పదో వికెట్‌కు 63 పరుగులు జోడించారు.

-->