Breaking News

వాట్సాప్, ఫేస్‌బుక్‌లను నిషేధించాలి

0 0

నూతన ప్రైవసీ పాలసీని వ్యతిరేకిస్తూ వాట్సాప్‌ను, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌పై నిషేధం విధించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) డిమాండ్ చేసింది. కొత్త పాలసీతో యూజర్ల వ్యక్తిగత సమాచారం, పేమెంట్ లావాదేవీలు, లొకేషన్‌తో పాటు ఇతర సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఫేస్‌బుక్‌కు అందించనుందని ఆరోపించింది. ఇది దేశభద్రతకే ముప్పు అని సీఏఐటీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాసింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు డేటా ఎంతో కీల‌క‌మైన‌ద‌ని, అలాంటి డేటాను చోరీ చేస్తామ‌ని చెప్పి వాట్సాప్‌, ఫేస్‌బుక్ త‌మ నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాయ‌ని విమ‌ర్శించింది. వెంట‌నే ప్ర‌భుత్వం ఇందులో జోక్యం చేసుకోవాల‌ని సీఏఐటీ జాతీయ అధ్య‌క్షుడు బీసీ భార్తియా డిమాండ్ చేశారు

-->