దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్లో కేదార్ జాదవ్ పేలవ ప్రదర్శన చేయడంతో త్వరలో జరగనున్న వేలంలో అతడిని వదులుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సిద్ధమైంది. కేదార్ జాదవ్‌తో పాటు రైనా, హర్భజన్, పీయూష్ చావ్లా, తాహిర్‌లను కూడా CSK యాజమాన్యం వదులుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ ధోనీ వరుసగా అవకాశాలిచ్చినా అతను వినియోగించుకోలేకపోయాడు. దాంతో ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో అతడిపై వేటు పడింది.
