సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం వస్తున్న సమయంలో కంటతడి పెట్టుకున్నాడు. దీనిపై తొలిరోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. తాను దేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం తన తండ్రి కల అని, ‘ఇప్పుడు నాన్న నన్ను చూస్తున్నాడనే అనుకుంటున్నా’అని వెల్లడించాడు. సిడ్నీ పిచ్ ఫ్లాట్‌గా ఉందని.. రానురానూ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని సిరాజ్ అన్నాడు. తొలిరోజు తమ బౌలర్లు బాగానే కష్టపడ్డా పిచ్ సహకరించలేదన్నాడు. రెండో రోజు పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలని.. కఠినమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులేసి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచుతామని తెలిపాడు. సైనీతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నాడు. కీపర్ క్యాచ్‌లు వదిలేస్తే బాధగానే ఉంటుందని, అలాంటి సందర్భాల్లో తర్వాతి ఓవర్ ఏకాగ్రతతో వేయడం ముఖ్యమని చెప్పాడు.
