Breaking News

సంక్రాంతికి టీవీలో సూర్య కొత్త సినిమా

0 0

లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలైన సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఈ సంక్రాంతికి బుల్లితెరపై ప్రసారం కానుంది. పండుగ సందర్భంగా జనవరి 14న సాయంత్రం 6:30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు జెమినీ టీవీ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హీరోయిన్‌గా నటించింది తొలి చిత్రమే అయినా అపర్ణ బాలమురళి తన నటనతో ఆకట్టుకుంది. పేదలకు తక్కువ ధరలో విమాన ప్రయాణం అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీకి ‘గురు’ ఫేం సుధ కొంగర దర్శకత్వం వహించింది.

-->