Breaking News

సంక్రాంతి బరిలో పవన్-ప్రభాస్ మధ్య పోరు

0 0

సంక్రాంతి సందర్భంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్ మధ్య టీజర్ల పోటీ తప్పకపోవచ్చు. పవన్ ‘వకీల్ సాబ్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్లు విడుదలకు సిద్ధమవుతున్న వేళ సోషల్ మీడియాలో ఈ రెండింటి మధ్య పోటీ నెలకొంది. ప్రభాస్ సినిమా పాన్ ఇండియా కాబట్టి టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పవన్ అభిమానులు కూడా తక్కువేమీ కాదు కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. ఏ టీజర్‌ను ఎంతమంది చూస్తారనే విషయం పక్కనబెడితే టాలీవుడ్‌ అభిమానులకు పండగ ట్రీట్ అయితే పక్కా లభిస్తుండటం సంతోషం కలిగించే విషయం.

-->