Breaking News

రెండు నిమిషాల్లోనే పేటీఎం పర్సనల్ లోన్

0 0

కొత్త సంవత్సరంలో పేటీఎం తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. అర్హత గల వినియోగదారులు కేవలం రెండు నిమిషాల్లోనే వ్యక్తిగత రుణాలను 365 రోజుల్లో ఎప్పుడైనా పొందవచ్చని తెలిపింది. ఈ రుణాలను వినియోగదారులు 18-36 నెలల్లో వాయిదా పద్దతిలో తీర్చవచ్చు. పేటీఎం ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలచే ప్రాసెస్ చేయబడతాయి. యూజర్లు తీసుకునే వాయిదాను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు. రుణ దరఖాస్తుల కోసం ఎటువంటి పేపర్ డాక్యుమెంటేషన్ లేకుండా మొత్తం ప్రక్రియను పేటీఎం డిజిటలైజేషన్ చేసింది.

-->