కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది రిపబ్లిడ్ డే వేడుకలు అతిథి లేకుండానే జరగనున్నాయి. ఇలా జరగడం ఇది నాలుగో సారి. తొలుత ఈ ఏడాది వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ కేసులు విజృంభిస్తుండటంతో ఆయన పర్యటన రద్దు అయ్యింది. గతంలో 1952,1953, 1966 సంవత్సరాల్లో జరిగిన గణతంత్ర వేడుకలకు కూడా అతిథులు హాజరుకాలేదు. అటు 1968, 1974లో మాత్రం ఇద్దరు ముఖ్య అతిథులు హాజరయ్యారు. 2018లో 10 ఆసియా దేశాలకు చెందిన అతిథులు గణతంత్ర వేడుకలకు వచ్చారు.