Breaking News

మార్చి 26న వస్తున్న రానా ‘అరణ్య’

0 0

రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ‘అరణ్య’ మూవీ ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. హిందీలో ‘హాథీ మేరా సాథీ’,  తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుద‌ల‌వుతోంది. ఈ చిత్రంలో రానా అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా క‌నిపించ‌బోతున్నాడు. జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా మార్చి 26నే నితిన్ నటించిన ‘రంగ్ దే’ మూవీ కూడా విడుదల కానుంది.

-->